పవన్ కు ఓటు వేస్తే ప్రమాదం
లోకల్ హీరోకు ఓటేయండన్న జగన్
పిఠాపురం – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ ను ఏకి పారేశారు. ఆయనకు అంత సీన్ లేదన్నారు. సినిమాలో మాత్రమే హీరో అని , ప్రజా సమస్యలను పట్టించుకున్నాడా అని ప్రశ్నించారు.
బయట నటించే హీరోకు ఓటు వేస్తే ఏమి వస్తుందన్నారు. అదే లోకల్ హీరోగా ఉన్న వారిని ఎన్నుకుంటే బావుంటుందని, వారు జవాబుదారీగా ఉంటారని చెప్పారు జగన్ రెడ్డి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించి ప్రసంగించారు.
చిన్నపాటి జ్వరం వస్తే హుటా హుటిన హైదరాబాద్ కు వెళ్లే పవన్ కళ్యాణ్ కావాలా లేక ఇక్కడే ఉంటూ స్థానికులతో నిరంతరం అందుబాటులో ఉండే తమ పార్టీకి చెందిన అభ్యర్థిని కావాలో తేల్చు కోవాలన్నారు. టీడీపీ కూటమికి పరాజయం తప్పదన్నారు ఏపీ సీఎం.
ఎన్నికల అఫిడవిట్ లో రూ. 931 కోట్లు ఎలా సంపాదించారో టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కోరారు. ఎంత కష్టం చేస్తే వచ్చాయో , ఆ క్రిమినల్ కేసుల సంగతి ఏమిటో కూడా చెబితే బాగుంటుందన్నారు.