ఫ్యాన్ గాలికి కొట్టుకు పోక తప్పదు
ఏపీ సీఎం వైఎస్ జగన్ రెడ్డి కామెంట్
శ్రీకాకుళం జిల్లా – ఏపీలో ప్రస్తుతం ఫ్యాన్ గాలి వీస్తోందన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి . ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా ఎంపీగా పోటీ చేస్తున్న పేరాడ తిలక్, ఎమ్మెల్యేగా బరిలో ఉన్న పిరియా విజయమ్మలను గెలిపించాలని కోరారు. భారీ ఎత్తున జనం ఆదరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
ఏం చేశారని చంద్రబాబు నాయుడు, పవన్ , పురంధేశ్వరి ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. జనం మరోసారి వారందరికీ వాత పెట్టేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు జగన్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత తనదేనని చెప్పారు.
ఇవాళ లబ్ది పొందని ఇల్లు అంటూ ఏదీ లేదన్నారు సీఎం. కావాలని చంద్రబాబు నాయుడు ఈసీకి ఫిర్యాదు చేయడం వల్ల వేలాది మందికి పెన్షన్లు, ఇతర సౌకర్యాలు నిలిపి వేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు జగన్ రెడ్డి. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకుంటే బెటర్ అని సూచించారు ఏపీ సీఎం.