NEWSANDHRA PRADESH

ఓట‌ర్ల రుణం తీర్చుకుంటా – జ‌గ‌న్

Share it with your family & friends

ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు

అమ‌రావ‌తి – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. గ‌త 50 రోజులుగా ఎన్నిక‌ల ప్ర‌చారం విస్తృతంగా చేప‌ట్టారు. కేవ‌లం సంక్షేమం, అభివృద్దిని ఆధారంగా చేసుకుని ఆయ‌న ప్ర‌జ‌ల‌తో సంభాషించారు. క‌లిసేందుకు ప్ర‌య‌త్నం చేశారు. ఈసారి కూడా ప‌వ‌ర్ లోకి రావాల‌ని చేసిన ప్ర‌య‌త్నానికి ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ప‌లికార‌ని పేర్కొన్నారు.

మే 13 సోమ‌వారం నాటితో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌కు తెర ప‌డింది. ఇక ఓట్ల‌న్నీ బ్యాలెట్ బాక్సుల‌లో భ‌ద్రంగా ఉన్నాయి. జూన్ 4న ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డ‌నున్నాయి. ఈ త‌రుణంలో అనూహ్య‌మైన రీతిలో ఆద‌రించినందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ పేరు పేరునా ధ‌న్య‌వాదాలు తెలియ చేసుకుంటున్న‌ట్లు తెలిపారు.

ఎన్నికల్లో మండు టెండలు సైతం లెక్క చేయకుండా నాకు ఆశీస్సులు ఇవ్వడానికి సునామీలా తరలి వచ్చిన నా అవ్వతాతలకు, నా అక్కచెల్లెమ్మలకు, నా అన్నదమ్ములకు, నా రైతన్నలకు, నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకు, నా యవతీ యువకులందరికీ పేరు పేరునా శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని తెలిపారు.