సంక్షేమానికి సర్కార్ పెద్దపీట
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – సంక్షేమం, అభివృద్ది పట్ల ఎక్కువగా తమ సర్కార్ దృష్టి సారించిందని అన్నారు ఏపీ సీఎం జగన్ రెడ్డి. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటుపై చర్యలు తీసుకున్నామన్నారు. ఈ నాలుగున్నర ఏళ్ల కాలంలో ఎక్కువగా నవ రత్నాలు అమలు చేయడం జరిగిందన్నారు. సోమవారం మేమంతా సిద్దం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు జగన్ రెడ్డి.
గతంలో బాబు హయంలో రెండు నెలలకు ఒకసారి పెన్షన్లు వచ్చేవని, కానీ తాము వచ్చాక సీన్ మారిందన్నారు. ప్రతి నెలా నెలా పెన్షన్లు వారి ఇంటి వద్దకే ఇచ్చేలా చేశామన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు జగన్ రెడ్డి.
బాబు హయాంలో కేవలం 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇచ్చారని ఆరోపించారు. కానీ తాను వచ్చాక అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం కల్పించేలా చేశానని అన్నారు. నెలకు కేవలం పెన్షన్ల కోసమే తమ ప్రభుత్వం రూ. 400 కోట్లు ఖర్చు చేశామన్నారు.
గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తాము తీసుకు వచ్చామన్నారు. అందులో భాగమే ఈ వాలంటీర్ల వ్యవస్థ అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒకటో తేదీనే పెన్షన్ అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఇవాళ ఏపీ రాష్ట్రంలో 66.34 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తూ వచ్చామని అన్నారు.