ఏపీకి విశాఖ ఐకానిక్ సిటీ
సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా ఆయన విశాఖ నగరం ఎందుకు అత్యంత అవసరమో అనేది స్పష్టం చేశారు. ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకమైన ఆర్థిక రాజధాని ఉండాలని పేర్కొన్నారు జగన్ రెడ్డి.
ఇదే సమయంలో ఉమ్మడి ఏపీని దారుణంగా , తమ స్వలాభం కోసం విభజించారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లు అవుతున్నా ఇంకా సమస్యలు అలాగే పేరుకు పోయాయని పేర్కొన్నారు సీఎం. ప్రతి రాష్ట్రానికి ఓ హైదరాబాద్ , బెంగళూరు, చెన్నై , కోల్ కతా, ముంబై లాంటి నగరాలు ఉండాలని అన్నారు.
అందుకే తాను పదే పదే విశాఖ పేరును ప్రస్తావిస్తూ వుంటానని, ఇందులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. విచిత్రం ఏమిటంటే ప్రతి ఏటా రూ. 13,000 కోట్ల ఆదాయం నష్ట పోతోందని దీనిని భర్తీ చేసేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోందన్నారు.
ప్రతిపక్షాలు ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఏదైనా విమర్శలు చేస్తే దానికి ఓ ప్రాతిపదిక ఉండాలన్నారు. జనం అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు.