టీడీపీ కూటమికి షాక్ తప్పదు
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి
గుంటూరు జిల్లా – చంద్రబాబు నాయుడు పగటి కలలు కంటున్నాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. టీడీపీ కూటమికి అంత సీన్ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పల్నాడు జిల్లాలో జరిగిన మేమంతా సిద్దం సభలో పాల్గొని ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తాము పని చేశామని చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో నవ రత్నాలు పేరుతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత తమదేనని పేర్కొన్నారు జగన్ మోహన్ రెడ్డి. ఏపీని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడిదేనని ధ్వజమెత్తారు.
తాము ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ దేశానికి ఆదర్శ ప్రాయంగా నిలిచిందన్నారు. పౌర సేవల్ని, పిల్లల చదువుల్ని, వైద్యాన్ని, రైతులకు అందుతున్న భరోసాను, వీటన్నింటితోపాటు అక్కచెల్లెమ్మల సాధికారతను, భద్రతను, అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా.. సిద్ధమేనా? అని పిలుపునిచ్చారు జగన్ మోహన్ రెడ్డి.