నారా లోకేష్ ఏపీ ఫ్యూచర్ సీఎం
అమెరికా – సీఎం నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మంత్రి నారా లోకేష్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు మంత్రి టీజీ భరత్. తను రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ బాబు సమక్షంలోనే పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా స్పందించారు చంద్రబాబు. అసందర్భంగా వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగ వేదికపై పంచుకోవడం సమంజసం కాదంటూ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా ఏపీలో కూటమిలో ముసలం చోటు చేసుకునేలా ఇలా వ్యాఖ్యలు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య ఒప్పందం చేసుకున్నామని, దీనిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఏదీ తెలుసుకోకుండా పార్టీ నియమావళికి విరుద్దంగా ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు. దీని వల్ల పార్టీకే కాకుండా ప్రభుత్వానికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం పొంచి ఉందన్నారు నారా చంద్రబాబు నాయుడు.