ఏపీలో కానిస్టేబుల్ కాల్‌లెటర్లు రిలీజ్
షెడ్యూల్ ఖరారు చేసిన ప్రభుత్వం
అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలోని కానిస్టేబుల్ అభ్యర్థులను అలర్ట్ చేసింది . ఫిజికల్ ఈవెంట్ల కాల్‌లెటర్లు శుక్రవారం విడుదల చేసింది. ఇందుకు సంబంధించి షెడ్యూలును ప్రకటించింది.
దేహదారుఢ్య (ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్/ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్) పరీక్షల కాల్‌లెటర్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. పరీక్షలకు ఎంపికైన అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, మొబైల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి కాల్‌లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.
పరీక్షల కాల్‌లెటర్లు ఈనెల 18న విడుదల చేయడం జరిగిందని పేర్కొంది పోలీసు నియామక మండలి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫిజికల్ ఈవెంట్లకు సంబంధించిన కాల్‌లెటర్లను అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. డిసెంబర్ 29 వరకు హాల్‌టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రకటించిన షెడ్యూలు ప్రకారం స్టేజ్-2 పీఎంటీ/ పీఈటీ పరీక్షలు డిసెంబర్ 30 నుంచి 2025 ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాల్లోని ప్రధాన కేంద్రాల్లో ఫిజికల్ ఈవెంట్లు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏమైనా సందేహాలుంటే 94414 50639 లేదా 91002 03323 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని సూచించింది.