NEWSANDHRA PRADESH

ట్ర‌బుల్ షూట‌ర్ తో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

Share it with your family & friends

కీల‌క అంశాల‌పై డిప్యూటీ సీఎం చ‌ర్చ‌లు

ఢిల్లీ – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌లు జ‌రిగిన త‌ర్వాత , డిప్యూటీ సీఎంగా కొలువు తీరాక ఆయ‌న అధికారికంగా దేశ రాజ‌ధానిలో ప‌ర్య‌టించ‌డం ఇదే తొలిసారి కావ‌డం విశేషం.

ఈ సంద‌ర్బంగా బీజేపీలో ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరు పొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాతో భేటీ అయ్యారు. ఏపీ రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించిన‌ట్టు స‌మాచారం.

అంతే కాకుండా రాష్ట్రంలో లా అండ్ ఆర్డ‌ర్ విష‌యంలో ఇటీవ‌లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌ధానంగా ఆయ‌న తెలుగుదేశం పార్టీకి చెందిన‌, ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి అనిత వంగ‌ల‌పూడిని టార్గెట్ చేశారు.

ఆమె మంత్రిగా ప‌నికి రాద‌ని, రాష్ట్రంలో ఎక్క‌డ ప‌డితే అక్క‌డ నేరాలు, అత్యాచారాలు, ఘోరాలు, సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయ‌ని ఆరోపించారు. అంతే కాదు తాను గ‌నుక హోం శాఖ మంత్రినైతే సీన్ వేరే లాగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు. ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యానాథ్ లాగా ఏపీ కావాల‌ని కోరారు.

ఈ త‌రుణంలో హోం శాఖ మంత్రిని ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌ల‌వ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.