ఎమ్మెల్యే కోటా కింద ఖరారు చేశాం
అమరావతి – జనసేన పార్టీ చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల సంచలన ప్రకటన చేశారు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ తన సోదరుడు పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు కొణిదలకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేశామన్నారు. బుధవారం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.
గతంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు ప్రకటించారని వెల్లడించారు. కేబినెట్ లోకి తీసుకుంటామని ప్రకటించారని తెలిపారు. ఇదిలా ఉండగా కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఊహించని రీతిలో ఎన్నికల్లో అద్బుత విజయాన్ని నమోదు చేశాయి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ గా నాగ బాబుకు ఛాన్స్ ఇస్తారని అనుకున్నారంతా. చివరకు పవన్ కళ్యాణ్, నాదెండ్ మనోహర్, కందుల దుర్గేష్ సైతం ఆశించారు. కానీ ఊహించని రీతిలో నాగ బాబుకు చెక్ పెట్టారు నారా చంద్రబాబు నాయుడు. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడుకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన చిత్తూరు జిల్లాకు చెందిన వారు.
ఎమ్మెల్సీ గా ఛాన్స్ ఇవ్వడంతో నాగబాబు తప్పనిసరిగా కేబినెట్ లోకి రావడం ఖాయమై పోయింది.