పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – విపత్తు నిర్వహణ గ్రామ స్థాయిలోనూ జరగాలన్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రతి పంచాయతీలోనూ అత్యవసర సమయంలో వేగంగా స్పందించేందుకు విపత్తు నిర్వహణ బృందాలు అవసరమన్నారు.
ప్రతి పంచాయతీ పరిధిలో విపత్తు సమయంలో సత్వరం స్పందించి, ఆపదలో ఉన్న వారిని కాపాడే బృందాలను తయారు చేస్తామన్నారు. వారికి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధులతో తగిన విధంగా శిక్షణ కల్పించి, వారి మార్గదర్శకంలో ముందుకు వెళ్లేలా పని చేస్తామన్నారు.
ఆదివారం ఉదయం గన్నవరం నియోజక వర్గం కొండపావులూరులో నిర్మితమైన పదో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా , ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో భాగంగా దక్షిణ భారత దేశంలోనే అతి పెద్ద జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రాంగణాన్ని సకల హంగులతో ప్రారంభం కావడం సంతోషంగా ఉందన్నారు. తుపాన్ల తాకిడి అధికంగా ఉండే ఏపీకి ఇది ఓ వరం లాంటిదన్నారు.