వెల్లడించిన ఏపీ సీఎంవో
అమరావతి – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సీఎంవో వెల్లడించింది. వైరల్ ఫీవర్‌తో పాటు స్పాండిలైటిస్‌తో బాధ పడుతున్నారని, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని, ఇవాళ జరిగే కేబినెట్ కీలక సమావేశానికి హాజరు కావడం లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అటు రాజకీయాలలో బిజీగా ఉన్నారు. పాలనా పరంగా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఇదే సమయంలో సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. తను హరి హర వీరమల్లు మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ తో మూవీని తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు ప్రముఖ నిర్మాత, దర్శకుడు ఎంఎం రత్నం.
ఇటీవలే తను కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత దేశ సినీ చరిత్రలో హరి హర వీరమల్లు చిత్రం చరిత్ర సృష్టించేందుకు రెడీగా ఉందన్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్స్ , సాంగ్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందన్నాడు.