ట్రబుల్ షూటర్ తో పవర్ స్టార్ భేటీ
బీఎల్ సంతోష్ కు వారాహి డిక్లరేషన్
ఢిల్లీ – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులను కలుసుకున్నారు. మరో వైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు సమయం ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్.
ఈ సందర్బంగా ఏపీ డిప్యూటీ సీఎం భారతీయ జనతా పార్టీలో కీలకమైన వ్యక్తిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా , ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన కర్ణాటకకు చెందిన బీఎల్ సంతోష్ ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్బంగా ఆయనను సన్మానించారు. తనతో కీలకమైన అంశాలపై చర్చలు జరిపారు. ఇదే సమయంలో వారాహి డిక్లరేషన్ కాపీని బీఎల్ సంతోష్ కు అందజేశారు. ఇదిలా ఉండగా ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అద్భుత విజయం సాధించడం, కూటమి సర్కార్ కొలువు తీరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో తాజాగా మరాఠాలో జరిగిన ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసిన ప్రచారంలో 7 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గెలవడం పట్ల కంగ్రాట్స్ తెలిపారు బీఎల్ సంతోష్.