గిరిజన ప్రాంతాల అభివృద్దే లక్ష్యం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి
అమరావతి – గిరిజన ప్రాంతాలను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.105 కోట్లతో చేపట్టిన రహదారి నిర్మాణ పనులకు బల్లగరువులో శంకుస్థాపన చేశారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ, ఐసీడీఎస్, పంచాయతీరాజ్, వన్ ధన్ వికాస్ స్టాల్స్ ను పరిశీలించారు. అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ప్రభుత్వం అన్ని రకాలుగా సాయం చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం.
అంతకు ముందు బల్లగరువు కొండపై ఉన్న గిరిజనులను కలుసుకునేందుకు నడుచుకొంటూ వెళ్ళారు. వారితో చాలా సేపు మాట్లాడారు. ప్రపంచ మార్కెట్ లో గిరిజన ఉత్పత్తులకు గిరాకీ పెరిగేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్బంగా చెప్పారు పవన్ కళ్యాణ్ కొణిదల.
గత వైసీపీ జగన్ రెడ్డి సర్కార్ కావాలని గిరిజన ప్రాంతాలను, గిరి పుత్రులను పట్టించు కోలేదని ఆరోపించారు. కేవలం మాజీ సీఎం బుగ్గలు నిమరడం, తలను తాకడం తప్పితే చేసింది ఏమీ లేదన్నారు. కానీ కూటమి ప్రభుత్వం కొలువు తీరాక సీన్ మారిందన్నారు. ఏ ఒక్కరు ఇబ్బంది పడకూడదనే తాను పనిగట్టుకుని ఇక్కడ పర్యటిస్తున్నానని తెలిపారు. నెలలో రెండుసార్లు ఇక్కడికి వస్తానని ప్రకటించారు డిప్యూటీ సీఎం.