డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
అమరావతి – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన డీలిమిటేషన్ పై తీవ్రంగా స్పందించారు. ఇంకా కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన వెలువడ లేదని, అంత మాత్రానికే రాజకీయ పార్టీలు రాద్దాంతం చేయడం దారుణమన్నారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఏది ఏమైనా తాను బలవంతంగా ఏ భాషను ఇతర రాష్ట్రాలపై రుద్దాలని చూడాలని అనుకోవడం లేదని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. దక్షిణాది సీట్లు ఎంత మాత్రం తగ్గవన్నారు. ఈ అంశంపై తమ సర్కార్ పూర్తిగా క్లారిటీతో ఉందన్నారు. ఇది రాజకీయాలు చేసే సమయం కాదన్నారు. కేంద్రానికి సహకరించాలని కోరారు.
సోమవారం పవన్ కళ్యాణ్ కొణిదల మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ సందర్బంగా తమిళనాడు సీఎం , డీఎంకే పార్టీ చీఫ్ ఎంకే స్టాలిన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రులు పినరయ్ విజయన్, భగవంత్ మాన్, ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా దక్షిణాది రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయం గురించి వివరించారు. ఇదే సమయంలో అందరూ ముక్త కంఠంతో కేంద్ర సర్కార్ నిర్ణయాన్ని ఒప్పుకోమన్నారు. దీనిపై పవన్ స్పందించారు.