ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్
అమరావతి – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదెల నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన సరస్వతి భూములను పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. సరస్వతి పవర్ కోసం దళితుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన దారుణాలు, ఆగడాలు, మోసాలకు ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్.
ప్రజలను భయపెట్టి తీసుకున్న ఆస్తిని కుటుంబ ఆస్తి లాగా వాడుకోవడం తనను విస్తు పోయేలా చేసిందన్నారు. పూర్తిగా అసైన్డ్ భూములపై కన్నేశారని, వినకపోతే బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీ డిప్యూటీ సీఎం.
అంతే కాదు కంపెనీ ఇక్కడ పెట్టలేదు. ఆపై లేని కంపెనీ పేరుతో 196 కోట్ల లీటర్ల నీటిని కూడా కేటాయించు కున్నారని, ఈ విషయం తెలిసి తాను ఆశ్చర్య పోయానని అన్నారు. అంతే కాదు అటవీ శాఖకు చెందిన భూములు ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసేందుకు కానీ బదలాయించేందుకు గానీ వీలు లేదన్నారు. ఇది చట్టం చెబుతుందని స్పష్టం చేశారు.
వినని రైతులను పెట్రోల్ బాంబులు వేసి భయాందోళనకు గురి చేశారని వాపోయారు పవన్ కళ్యాణ్ కొణిదెల. దీంతో మొత్తం సరస్వతి భూముల వ్యవహారం పై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు .