డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వార్నింగ్
కడప జిల్లా – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నేతలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారులపై దాడి చేయడం వారికి కొత్తేమీ కాదన్నారు. ఇది వైసీపీ రాజ్యం అనుకుంటున్నారని, కానీ ఇక చెల్లదన్నారు.
శనివారం వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడైన ఎంపీడీఓను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులతో చర్చించారు. మెరుగైన వైద్య సదుపాయం అందించాలని ఆదేశించారు. తాను మీకు ఉన్నానంటూ జవహర్ బాబు కుటుంబానికి భరోసా ఇచ్చారు.
అనంతరం పవన్ కళ్యాణ్ ఆస్పత్రి ఆవరణలో మీడియాతో మాట్లాడారు. వైకాపాపై , ఆ పార్టీ చీఫ్ , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అహంకార పూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇక నుంచి ఎవరు దాడికి పాల్పడినా తోలు తీస్తామని వార్నింగ్ ఇచ్చారు డిప్యూటీ సీఎం.
చూస్తూ ఊరుకునేది లేదని అన్నారు. ఏ స్థాయిలో ఉన్న నాయకుడైనా వదిలి పెట్టే ప్రసక్తి లేదని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోమన్నారు పవన్ కళ్యాణ్.