బీజేపీ కోసం ప్రచారం చేయడం లేదు
పుణ్య క్షేత్ర యాత్రలో భాగంగా తమిళనాడులో పర్యటిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తంజావూరు కుంభకోణం సమీపంలోని స్వామి మలై క్షేత్రానికి చేరుకున్నారు. శ్రీ స్వామి నాథ స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు తిరువనంతపురం లోని తిరువల్లం శ్రీ పరుశురామ క్షేత్రాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు . ఆయన వెంట కొడుకు అకిరా, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి ఉన్నారు. పవన్ కళ్యాణ్ కు ఘన స్వాగతం పలికారు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సభ్యులు.
తన యాత్రలో కేరళలో పర్యటించారు. అనంతరం తమిళనాడుకు చేరుకున్నారు. ఇక్కడ ప్రధాన ఆలయాలను దర్శించుకున్న అనంతరం ఇతర ప్రాంతాలను సందర్శిస్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు .
తాను భారతీయ జనతా పార్టీకి మౌత్ పీస్ గా తయారైనట్లు కొందరు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టారు. తనకు ఆ అవసరం లేదన్నారు. ఎన్నికల కంటే ముందు తాను మొక్కుకున్నానని, గెలిస్తే వస్తానని , దర్శించుకుంటానని తెలిపారు. మొక్కులో భాగంగా తాను ప్రముఖ పుణ్య క్షేత్రాలను దర్శించు కోవడం జరుగుతోందన్నారు.
సనాతన ధర్మాన్ని పరిరక్షించు కోవడం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. టీటీడీలో జరిగిన ఘటన పట్ల ఆవేదన చెందారు. పవిత్రతను కాపాడు కోవాలని సూచించారు పాలక మండలికి.