ఎంపీడీఓకు పరామర్శ పవన్ భరోసా
దాడికి దిగిన వారిపై తీవ్ర ఆగ్రహం
కడప జిల్లా – కడప రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు వైద్యులతో. ఇదిలా ఉండగా ఇటీవల వైసీపీ నాయకులు అందరూ చూస్తూ ఉండగానే ఎంపీడీఓపై భౌతికంగా దాడికి దిగారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు జవహర్ బాబు.
వెంటనే ఎండీఓను రిమ్స్ కు తరలించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్ లో మాట్లాడారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ఈ మొత్తం ఘటనపై విచారణకు ఆదేశించారు. తక్షణమే వివరాలు అందించాలని స్పష్టం చేశారు.
దౌర్జన్యాలు, రౌడీ చర్యలకు పాల్పడితే రౌడీ షీట్లు తెరుస్తామని వార్నింగ్ ఇచ్చారు మంత్రి. అధికారులు, సామాన్యులపై వైసీపీ నాయకుల దాడి..వారి ఆధిపత్యం, అహంకారానికి నిదర్శనమన్నారు. విధి నిర్వహణలోని అధికారిపై పిడిగుద్దులతో విరుచుకుపడిన ఘటనను కూటమి ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు.