NEWSANDHRA PRADESH

చంద్ర‌బాబుకు రుణ‌ప‌డి ఉన్నా

Share it with your family & friends

డిప్యూటీ స్పీక‌ర్ కామెంట్స్

అమ‌రావ‌తి – తాను జీవితంలో ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడును మ‌రిచి పోలేన‌ని అన్నారు ఏపీ డిప్యూటీ స్పీక‌ర్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన ఉండి ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణ‌మ రాజు. త‌న జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాన‌ని, కానీ ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడ‌టం త‌న‌కు అల‌వాటు అన్నారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో త‌న‌ను చిత్ర‌హింస‌ల‌కు గురి చేశార‌ని వాపోయారు. అయినా త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని, దీనికి ఆ దేవుడు ఇచ్చిన బ‌ల‌మేన‌ని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో రాజ‌కీయ ప‌రంగా త‌న‌కు మార్గ‌ద‌ర్శ‌కుడిగా ఉంటూ ఎప్ప‌టిక‌ప్పుడు ధైర్యం చెబుతూ వ‌చ్చిన చంద్ర‌బాబు నాయుడు మేలును తాను మ‌రిచి పోలేన‌ని అన్నారు. ఇదే స‌మ‌యంలో కేంద్ర ప్ర‌భుత్వంలో కొలువు తీరిన ప్ర‌ధాన‌మంత్రి మోడీ, రాష్ట్ర‌ప‌తి , ఇత‌ర కేంద్ర మంత్రుల స‌హాయ స‌హ‌కారాలు త‌న‌కు ఉండ‌డం అదృష్టంగా భావిస్తున్న‌ట్లు చెప్పారు.

ఇదే స‌మ‌యంలో ఆనాడు జ‌గ‌న్ రెడ్డిని, ఆయ‌న ప‌రివారాన్ని త‌ట్టుకుని నిల‌బ‌డ్డాన‌ని గుర్తు చేసుకున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా గత ప్రభుత్వం రుషికొండ మీద చేసిన అక్రమ నిర్మాణాలపై అసెంబ్లీలో మాట్లాడారు.

గత ప్రభుత్వం ప్రజా ధనంతో రుషికొండపై అక్రమ నిర్మాణాలు చేసిందని, ఈ అక్రమ నిర్మాణాలను ఆపేందుకు గతంలో తాను కూడా కోర్టును ఆశ్రయించానని చెప్పారు ప్రజా ధనంతో నిర్మించిన ఈ భవనాలను కూల్చి వేయకుండా పర్యాటక రంగానికి ఉపయోగించాలని సంబంధిత మంత్రిని కోరారు.