భావోద్వేగానికి లోనైన మాజీ డీజీపీ
అమరావతి – ఏపీ డీజీపీగా విశిష్ట సేవలు అందించిన ద్వారకా తిరుమల రావు పదవీ విరమణ పొందారు. ఈ సందర్బంగా తనకు ఘనంగా వీడ్కోలు పలికిన తోటి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇదే సమయంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. జీవితంలో పోలీస్ యూనిఫాంకు ఎనలేని గౌరవం ఉంటుందన్నారు. ఇవాళ దానిని వదిలి వేయాలంటే బాధగా ఉందన్నారు.
తనకు శిక్షణ ఇచ్చిన హెడ్ కానిస్టేబుల్ నిరంజన్ కు, తన వెన్నంటి ప్రోత్సహిస్తూ వచ్చిన భార్యకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరిని మరిచి పోలేనని అన్నారు. ద్వారకా తిరుమల రావుకు పోలీసులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయనను పోలీసు వాహనంలో ఊరేగింపుగా తీసుకు వచ్చారు. గౌరవ వందనం చేశారు.
తనను కన్న తల్లిదండ్రులకు రుణపడి ఉన్నానని చెప్పారు. ఏపీఎస్పీ 6వ బెటాలియన్ గ్రౌండ్ లో ఫేర్ వెల్ నిర్వహించారు. పరేడ్ లో పాల్గొన్నారు నూతన డీజీపీగా నియమితులైన హరీష్ కుమార్ గుప్తా. తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. తనతో పాటు పని చేసిన సిబ్బందికి శుభాభినందనలు తెలిపారు.
35 ఏళ్ల పాటు యూనిఫామ్ వేసుకుని ఇవాళ వదిలి పెట్టాలంటే బాధగా ఉందన్నారు.