NEWSANDHRA PRADESH

డిప్యూటీ సీఎంతో డీజీపీ భేటీ

Share it with your family & friends

లా అండ్ ఆర్డ‌ర్ పై స‌మీక్ష

అమ‌రావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి కొణిదెల ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను డీజీపీ ద్వార‌కా తిరుమ‌ల రావు భేటీ అయ్యారు. వీరిద్ద‌రి భేటీ అత్యంత ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది. ఇటీవ‌లే రాష్ట్రంలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న‌లపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ప్ర‌ధానంగా ఆయ‌న ఏపీ రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌ను టార్గెట్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. ఇందుకు సంబంధించి ఎంఆర్పీఎస్ చీఫ్ మంద‌కృష్ణ మాదిగ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఏపీ డిప్యూటీ సీఎంకు.

దీనిపై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు ఏపీ మంత్రులు పొంగూరు నారాయ‌ణ‌, అనిత వంగ‌ల‌పూడి. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మంగ‌ళ‌గిరి లోని హోం శాఖ కార్యాల‌యంలో మంత్రిని క‌లిశారు డీజీపీ . రాష్ట్రంలో నెల‌కొన్న శాంతి భ‌ద్ర‌త‌ల‌పై స‌మీక్ష చేప‌ట్టారు.

అనంత‌రం డీజీపీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో భేటీ కావ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఆయ‌న ప‌వ‌న్ కళ్యాణ్ తో ఏం మాట్లాడార‌నేది బ‌య‌ట‌కు చెప్ప‌లేదు. దీనిపై డిప్యూటీ సీఎం కూడా ఎక్క‌డా మాట్లాడ‌క పోవ‌డం విశేషం. ఇదే స‌మ‌యంలో చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీలో పీఎం మోడీని క‌ల‌వ‌డం కూడా ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.