ఏపీఎస్డీఆర్ఎఫ్ సేవలు భేష్ – డీజీపీ
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటన
అమరావతి – ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. ఓ వైపు అధికార యంత్రాంగంతో పాటు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు రేయింబవళ్లు సహాయక చర్యలలో నిమగ్నం అయ్యారు. ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించారు. ఆయన స్వయంగా బోటులో ప్రయాణం చేశారు. బాధితులకు భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
ఈ సందర్బంగా విజయవాడ నగర పరిసర వరద ముంపు ప్రాంతాలలో పర్యటించిన డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, ఇతర ఉన్నతాధికారులు సహాయక చర్యలలో కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. ఈ సందర్బంగా వారి సేవలను కొనియాడారు.
ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి , డీజీపీ కార్యాలయం నుంచి ఆరా తీస్తున్నామని చెప్పారు.
వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన అనంతరం డీజీపీ మీడియాతో మాట్లాడారు. ప్రజలను అప్రమతం చేస్తూ, ముంపు ప్రాంతాలలో వున్న ప్రజలను సురిక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది అందిస్తున్న సేవల గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు.