డీజీపీ ద్వారకా తిరుమల రావు వార్నింగ్
తిరుమల – ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా గంజాయి లేకుండా చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం పూర్తిగా దానిపై ఫోకస్ పెట్టిందన్నారు.
త్వరలో యాంటీ నార్కొటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ గంజాయి, మాదక ద్రవ్యాల బెడద ఎక్కువై పోయిందని ఆవేదన చెందారు. తాను బాధ్యతలు స్వీకరించిన వెంటనే వీటి నిర్మూలనపై దృష్టి సారించానని చెప్పారు ద్వారకా తిరుమల రావు.
ఇందులో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ మేరకు గంజాయిని అరికట్టేందుకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామని చెప్పారు ఏపీ డీజీపీ. ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అడ్డుకుంటామని హెచ్చరించారు.
అంతే కాకుండా ప్రధాన నగరాలలో నేరాల అదుపు కోసం ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చచేశారు ద్వారకా తిరుమల రావు. పోలీసుల కోసం కొత్త వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా గత కొంత కాలంగా పోలీస్ శాఖలో ఆగి పోయిన పదోన్నతులను త్వరలో ఇస్తున్నట్లు తెలిపారు .