శభాష్ ఏపీ డీజీపీ
పోలీసుల కితాబు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ బాస్ హరీశ్ కుమార్ గుప్తా సంచలనంగా మారారు. రాష్ట్రంలో కొత్తగా టీడీపీ కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది. అమరావతిలోని ఐటీ పార్కు వేదికగా అంగరంగ వైభవంగా సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది.
ఈ సందర్భంగా డీజీపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. తమ విధులను నిర్వహించారు సమర్థవంతంగా. ఈ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖులు, సినీ, రాజకీయ, వ్యాపార,వాణిజ్య రంగాలకు చెందిన అతిరథ మహారథులు ఏపీకి విచ్చేశారు.
ఓ వైపు గన్నవరం విమానాశ్రయం అతిథుల రాకతో క్రిక్కిరిసి పోయింది. మరో వైపు అన్ని దారులు అమరావతి వైపు సాగాయి. వేలాది మంది భారీ ఎత్తున తరలి వచ్చారు రాష్ట్రం నలుమూలల నుంచి . దీంతో భారీ ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముందే వాహనదారులు, పాదచారులకు హెచ్చరికలు జారీ చేశారు.
చివరకు ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా రంగంలోకి దిగారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశారు. దీంతో ప్రతి ఒక్కరు డీజీపీ నిబద్దతను ప్రశంసిస్తున్నారు.