NEWSANDHRA PRADESH

ప్ర‌తి జిల్లాకు ప్ర‌త్యేక పోలీస్ ఆఫీస‌ర్

Share it with your family & friends

నియ‌మించిన ఏపీ డీజీపీ గుప్తా

అమ‌రావ‌తి – ఆంద్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఓట్ల లెక్కింపు సంద‌ర్బంగా కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు డీజీపీ గుప్తా. ఈ మేర‌కు ఆయ‌న కీల‌క చ‌ర్య‌లు తీసుకున్నారు. ప్ర‌తి జిల్లాకు ప్ర‌త్యేకంగా పోలీస్ ఆఫీస‌ర్ల‌ను నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు ఇవాళ జారీ చేశారు.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల‌తో పాటు ఇత‌ర ప్రాంతాల‌కు సంబంధించి మొత్తం 56 మంది పోలీసు ఆపీస‌ర్ల‌ను నియ‌మించిన‌ట్లు తెలిపారు డీజీపీ. ఈ మేర‌కు ఆదేశాల‌కు అనుగుణంగా నియ‌మించ బ‌డిన స్పెష‌ల్ ఆఫీస‌ర్స్ ఆయా జిల్లాల ఉన్నతాధికారుల‌కు రిపోర్టు చేయాల‌ని ఆదేశించారు

సున్నిత ప్రాంతాల్లో శాంతి భద్రతల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించాలని ఏపీ డీజీపీ స్ప‌ష్టం చేశారు. విచిత్రం ఏమిటంటే పల్నాడుకు అత్యధికంగా 8 మంది పోలీస్ అధికారులకు కేటాయించిన‌ట్లు చెప్పారు డీజీపీ గుప్తా.