ఏపీ డీజీపీ షాకింగ్ కామెంట్స్
బెదిరింపులకు పాల్పడితే జైలే
మంగళగిరి – ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా షాకింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
కౌంటింగ్ తర్వాత మీ అంతు చూస్తామంటూ కొంత మంది వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థి శిబిరాలకు సవాలు విసురుతూ సమాజంలో అశాంతి సృష్టిస్తున్నారని తమ దృష్టికి వచ్చిందన్నారు డీజీపీ. మరి కొందరు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
అట్టి వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, వారిపై ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామన్నారు డీజీపీ, పీడీ యాక్ట్ ప్రయోగించడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పోస్టులను, ఫోటోలను , వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టు కోవడం లేదా షేర్ చేయడం కూడా నిషిద్ధమన్నారు. గ్రూప్ అడ్మిన్ లు కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని తెలిపారు.