ఏపీ సర్కార్ ఖుష్ కబర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ లో కొలువు తీరిన కొత్త సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ ప్రకటించారు. తొలి సంతకం దానిపైనే చేశారు. మొత్తం డీఎస్సీలో 16,347 పో స్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఇదిలా ఉండగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీకి సంబంధించి మార్పులు చేశారు. అదనపు పోస్టులను చేర్చారు. దీంతో భారీ ఎత్తున పోస్టులు రానున్నాయి. ఇందులో భాగంగా మొత్తం పోస్టులకు సంబంధించి చూస్తే 2,280 సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) టీచర్ పోస్టులు ఉండగా 2299 పోస్టులు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించింది సర్కార్.
వీటితో పాటు 215 పోస్టు గ్రాడ్యూయేట్ టీచర్ పోస్టులు, 42 ప్రిన్సిపాల్ పోస్టులు కేటాయించారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.