ఏపీ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
రిలీజ్ చేసిన విద్యా శాఖ మంత్రి
అమరావతి – ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఈ మేరకు ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 6,100 పోస్టులతో నోటిఫికేషన్ వెలువరించింది.
ఇందులో 2,280 ఎస్టీజీ పోస్టులు 2,299 స్కూల్ అసిస్టెంట్స్ పోస్టు, 1264 టీజీటీ పోస్టులు, 215 పీజీటీలు, 42 ప్రిన్సిపాల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఈనెల 12 నుంచి 21 వరకు ఫీజులు చెల్లించేందుకు గడువు విధించినట్లు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. మార్చి 5 నుంచి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. మార్చి 15 నుంచి 30 వరకు ఆన్ లైన్ లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు , మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ కింద పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు బొత్స సత్యనారాయణ.
మార్చి 31న ప్రాథమిక కీ విడుదల చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 1న ప్రాథమిక కీ పై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. 2న ఫైనల్ కీ రిలీజ్ చేస్తామని, ఏప్రిల్ 7న డీఎస్సీ ఫలితాలు ప్రకటిస్తామన్నారు మంత్రి.