NEWSANDHRA PRADESH

క‌ర‌క‌ట్ట బాధితుల‌కు డిప్యూటీ సీఎం భ‌రోసా

Share it with your family & friends

అన్ని స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రిస్తాన‌న్న ప‌వ‌న్

అమ‌రావ‌తి – ఏపీ డిప్యూటీ సీఎం బాధితుల‌కు భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నం చేశారు. శుక్ర‌వారం మంగ‌ళ‌గిరి లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో ప్ర‌జా ద‌ర్బార్ చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా విజయవాడ 38వ డివిజన్ కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతానికి చెందిన నసీమా అనే యువతి ఇటీవల వచ్చిన భారీ వరదల వల్ల తమ ప్రాంతంలో 300 ఇళ్లు నీట మునిగిపోయాయని, తీవ్రంగా నష్టపోయామని ఏపీ డిప్యూటీ సీఎంకు విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు.

దీనిపై వెంట‌నే స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. న్యాయం చేయాల‌ని సూచించారు. బాధితులు ఎవ‌రూ కూడా ఆందోళ‌న చెంద వ‌ద్ద‌ని కోరారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇదిలా ఉండ‌గా న‌సీమాతో పాటు ఆ ప్రాంతానికి చెందిన నగీనా, విజయ, భవాని, సుధారాణి తదితరులు తామెలా నష్టపోయిందీ వివరించారు.

38వ డివిజన్ కార్పొరేటర్ మాత్రం కుమ్మరిపాలెం కరకట్ట ప్రాంతం వరదల వల్ల ప్రభావితం కాలేదని అధికారులను తప్పు దోవ పట్టించారని ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఉప ముఖ్యమంత్రివర్యులు స్పందించి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కు తక్షణమే వివరాలు పంపించి నసీమా, నగీనా, ఇతర మహిళలు తెలిపిన సమస్యపై తగిన చర్యలు తీసుకొనేలా చూడాలని ఆదేశించారు.