ఢిల్లీలో ఎంపీలకు పవన్ కళ్యాణ్ విందు
హాజరైన తెలంగాణ..ఏపీ అన్ని పార్టీల ఎంపీలు
న్యూఢిల్లీ – దేశ రాజధానిలో సందడి చేశారు , సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ కొణిదల. ఉప ముఖ్యమంత్రిగా కొలువు తీరాక అధికారికంగా ఢిల్లీకి రావడం, అక్కడ కీలకమైన కేంద్ర మంత్రులను కలుసు కోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇదే సమయంలో ఓ వైపు పార్లమెంట్ సమావేశాలు ఉన్నప్పటికీ దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోడీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఈ సందర్బంగా కీలకమైన అంశాల గురించి ప్రస్తావించారు. ప్రధానంగా ఏపీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకు వచ్చిన జల్ జీవన్ మిషన్ ను గత జగన్ రెడ్డి సర్కార్ నిర్వీర్యం చేసిందని పీఎంకు తెలిపారు.
ఇదే సమయంలో తిరిగి మిషన్ ను పునః ప్రారంభించేందుకు అవకాశం ఇవ్వాలని , కూటమి ప్రభుత్వం ఫోకస్ పెడుతుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా పీఎంను కలిసిన అనంతరం డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో ఎంపీలకు విందు ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలు హాజరయ్యారు. జనసేన, టీడీపీ, బీజేపీకి చెందిన ఎంపీలు హాజరు కావడం విశేషం.