ANDHRA PRADESHNEWS

పీఎం మోడీతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ భేటీ

Share it with your family & friends

స‌మ‌యం కేటాయించినందుకు థ్యాంక్స్
ఢిల్లీ – ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల మ‌ర్యాద పూర్వ‌కంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో భేటీ అయ్యారు. బుధ‌వారం మోడీతో కొద్ది సేపు మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా మ‌రాఠాలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో ప్ర‌చారం గురించి కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌చారం చేసిన ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌హాయుతి కూట‌మి అభ్య‌ర్థులు 7 సీట్ల‌కు గాను 7 సీట్లు కైవ‌సం చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేకంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఉద్దేశించి ప్ర‌స్తావించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఇటీవ‌ల మ‌రాఠాలో కూట‌మి గెలుపొందడం ప‌ట్ల‌.

ఇక ఏపీలో ఇటీవ‌ల జ‌రిగిన శాస‌న స‌భ‌, లోక్ స‌భ ఎన్నిక‌ల్లో సైతం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ అన్ని సీట్ల‌లో విజ‌యం సాధించింది. స్టార్ క్యాంపెయిన‌ర్ గా ఎన్డీయే కూట‌మి త‌ర‌పున ప్ర‌చారం చేశారు. ప్ర‌త్యేకించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఉన్న ఛ‌రిష్మా దృష్ట్యా త‌న‌ను బీజేపీ ఇత‌ర రాష్ట్రాల‌లో వాడుకునేందుకు కీల‌క ప‌ద‌వి కూడా ఇవ్వ‌నున్న‌ట్లు స‌మాచారం. పెద్ద ఎత్తున ప్ర‌చారం కూడా జ‌రుగుతోంది.

ఇదే స‌మ‌యంలో జ‌న‌సేన పార్టీతో పాటు త‌న సోద‌రుడు ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, న‌టుడు నాగ‌బాబు కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌న నాయకుడు త‌న సోద‌రుడు అని, దేశ్ కీ నేత అంటూ పేర్కొన్నారు. మొత్తంగా జాతీయ స్థాయిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌కం కాబోతున్నార‌నేది వాస్త‌వం.