3.5 లక్షల మందికి పైగా
అమరావతి – ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే EAPCET మే 19న ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 145 కేంద్రాల్లో నిర్వహించనున్నారు పరీక్షను. ప్రవేశ పరీక్షకు మొత్తం 3,62,392 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో కూడా రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్.
కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ గత మార్చి నెల 12న ఏపీఈపీసెట్ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తు ఫారాలను మార్చి 15న అందుబాటులో ఉంచారు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్ 24 వరకు స్వీకరించారు. ఇక పరీక్షకు హాజరు కావాలని అనుకునే స్టూడెంట్స్ కోసం ఏపీ విద్యా శాఖ ఛాన్స్ ఇచ్చింది. రూ. 10 వేల అపరాధ రుసుముతో శుక్రవారం నాటికి అంటే మే 16 వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించింది.
ఇంకా కొన్ని గంటలు మాత్రమే ఉండడంతో పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను మే 12 నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది జెఎన్టీయూ. ఈ మేరకు ఏపీ ఉన్నత విద్యా మండలి అధికారిక వెబ్ సైట్ నుంచి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.