ఏపీ ఆర్థికాభివృద్దిపై టాస్క్ ఫోర్స్
కీలక సమావేశంలో పలు చర్చలు
అమరావతి – టాటా సన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎన్ . చంద్రశేఖరన్ ఆధ్వర్యంలో ఏపీ ఆర్థికాభివృద్దికి సంబంధించి ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్ , టీజీ భరత్ తో పాటు కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 కు అనుగుణంగా టాస్క్ ఫోర్స్ ఫోకస్ పెట్టింది. తొలి సమావేశం జరగడం విశేషం.
కీలకమైన పరిశ్రమల ప్రముఖులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్. ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం ఒక సాహసోపేతమైన, రూపాంతరమైన రోడ్ మ్యాప్‌ను రూపొందించడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు .
తమ చర్చలు ముఖ్యంగా తయారీ, మౌలిక సదుపాయాలు, ఎంఎస్ఎంఈలు, నైపుణ్యాభివృద్ధి వంటి ముఖ్యమైన రంగాలపై కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ప్రాధాన్యతలు 2030, 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ పూర్తి సామర్థ్యాన్ని అన్‌లాక్ చేయడంలో మార్గని ర్దేశం చేస్తాయని అన్నారు టీజీ భరత్. తాము నిర్మిస్తున్న పునాది రాష్ట్రానికి సుసంపన్నమైన భవిష్యత్తును రూపొందిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.