సీఎం జగన్ కు ఈసీ ఝలక్
వాలంటీర్లను వాడుకోవద్దు
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం సీఈసీ ఆదేశాల మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. సర్కార్ కు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ప్రభుత్వానికి కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది ఈసీ తీసుకున్న నిర్ణయం.
ఇప్పటికే ప్రధాన పార్టీలైన ఏపీకి చెందిన తెలుగుదేశం పార్టీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ , భారతీయ జనతా పార్టీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
ఈ మేరకు ఏపీ ఎన్నికలతో ముడి పడిన ఎలాంటి ప్రక్రియ లోనూ గ్రామవార్డు వాలంటీర్లు పాల్గొనకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో వాలంటీర్లను అన్ని రకాల ఎన్నికల విధుల నుంచి తక్షణం తొలగించాలని స్పష్టం చేసింది.
ఎన్నికలకు సంబంధించి ఎలాంటి ప్రక్రియలో పాల్గొన్నా ఈసీ మార్గదర్శకాల ఉల్లంఘనేనని వార్నింగ్ ఇచ్చింది. పోలింగ్ ఏజెంట్లుగా వాలంటీర్లు అర్హులు కాదని పేర్కొంది రాష్ట్ర ఎన్నికల సంఘం.