ANDHRA PRADESHNEWS

ఏపీ ఫ‌లితాల‌పై ఉత్కంఠ‌

Share it with your family & friends

వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ కూట‌మి

అమ‌రావ‌తి – దేశ వ్యాప్తంగా మంగ‌ళ‌వారం లోక్ స‌భ స్థానాల‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని 175 శాస‌న స‌భ , 25 లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి ఫ‌లితాలు వెల్ల‌డి కానున్నాయి. ప్ర‌ధానంగా అధికారంలో ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీతో పాటు చంద్ర‌బాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ, జ‌న‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీ కూట‌మి మ‌ధ్య హోరా హోరీ కొన‌సాగుతోంది.

ప్ర‌ధాన పార్టీల‌తో పాటు ఈసారి ఏఐసీసీ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్రంలో ఎవ‌రికి ఓటు వేసినా ఆ ఓట్ల‌న్నీ మోడీకే వెళ‌తాయంటూ ప్ర‌చారం చేయ‌డంలో స‌క్సెస్ అయ్యింది. ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో దివంగ‌త ఏపీ సీఎం డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యురాలు , సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఏపీ పీసీసీ చీఫ్ గా ఎంపిక చేసింది.

దీంతో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్ర‌తిప‌క్షాల‌న్నీ జ‌గ‌న్ రెడ్డిని టార్గెట్ చేశారు. ఇక వైసీపీ బాస్ మాత్రం సానుకూల దృక్ప‌థంతో ప్ర‌చారం చేప‌ట్టారు. మొత్తంగా కొన్ని గంటల్లో ఎవ‌రు గెలుస్తార‌నేది తేలి పోనుంది.