NEWSANDHRA PRADESH

వ‌ర‌ద బాధితుల కోసం ఉద్యోగుల విరాళం

Share it with your family & friends

భారీ ఎత్తున ఏపీ ప్ర‌భుత్వానికి విరాళం

అమ‌రావ‌తి – ఏపీలో చోటు చేసుకున్న వ‌ర్షాల కార‌ణంగా దెబ్బ‌తిన్న వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా ఉండేందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తీవ్ర న‌ష్టం ఏర్ప‌డిన ఏపీని ఆదుకోవాల‌ని కోరుతూ సీఎం చంద్ర‌బాబు నాయుడు పిలుపునిచ్చారు.

వరద బాధితులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని పంచాయితీ రాజ్ ఉద్యోగులు తమ సహాయాన్ని అందించారు. ఒక రోజు వేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని ప్రకటించారు.

పంచాయతీరాజ్‌ జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌తో సమావేశమై 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒకరోజు మూల వేతనం రూ.14 కోట్లు, పంచాయతీరాజ్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఉద్యోగులు రూ. 75 లక్షలు, గ్రామీణ నీటి పారుదల శాఖ ఉద్యోగులకు రూ. 10 లక్షలు. ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ఇస్తున్నట్లు లేఖలు అందజేశారు.

ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఉద్యోగులను ఉప ముఖ్యమంత్రి అభినందించారు.