తెలుగుదేశం పార్టీకి బిగ్ షాక్
అమరావతి – ఏపీ సర్కార్ కు బిగ్ షాక్ తగిలింది. ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జీవీ రెడ్డి. తన రాజీనామా పత్రాన్ని పార్టీ చీఫ్, సీఎం చంద్రబాబుకు పంపించారు. తను లాయర్ గా కొనసాగుతానని, ఇక నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. తనను ఏరికోరి ఎంపిక చేశారు సీఎం. ఇదే సమయంలో ఫైబర్ నెట్ లో ఎండీగా పని చేస్తున్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పై బహిరంగంగానే ఆరోపణలు చేశారు జీవీ రెడ్డి. దీనిపై సీరియస్ అయ్యారు చంద్రబాబు. బహిరంగంగా విమర్శలు చేస్తే పాలనా పరంగా ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు.
అంతే కాకుండా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు జీవీ రెడ్డి. అప్పుల ఊబిలో కూరు పోయిన ఏపీ ఫైబర్ నెట్ సంస్థను గాడిలో పెట్టేందుకు తను ప్రయత్నం చేశారు. అయితే ఇందులో దొంగలు పడ్డారంటూ మండిపడ్డారు. బహిరంగంగానే ఆరోపణలు చేశారు. అంతేకాకుండా జగన్ హయాంలో దొడ్డిదారిన నియమించబడిన ఉద్యోగులను తొలగించారు. ఫైబర్ నెట్ సంస్థలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు జీవీ రెడ్డి.
ఈ సందర్బంగా జీవీ రెడ్డి వ్యవహారంపై సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు గుస్సా కావడంతో చంద్రబాబు నాయుడు ఈ సమస్యను సీరియస్ గా తీసుకోవడం, అందరి ముందే జీవీ రెడ్డికి క్లాసు పీకడంతో మనస్తాపంతో తను రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.