ఏపీ ఫైబర్ నెట్ లో 410 మంది తొలగింపు
సంచలన నిర్ణయం తీసుకున్న చైర్మన్
అమరావతి – ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ జీవీ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి 410 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. జగన్ రెడ్డి వైసీపీ హయాంలో అక్రమంగా నియామకాలు జరిపారని ఆరోపించారు. ఎక్కువ మందిని అవసరం లేకున్నా నియమించారని మండిపడ్డారు. జీవీ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
నియామకం జరిపే విషయంలో ఎలాంటి ప్రామాణికత పాటించలేదని, కేవలం వైసీపీ నేతల సిఫారసులతో ఉద్యోగాలు పొందారని ఫైర్ అయ్యారు. ఈ మొత్తం వ్యవహారంపై తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే విచారణ చేపట్టడం జరిగిందని చెప్పారు. దీంతో విస్తుపోయేలా వాస్తవాలు వెలుగు చూశాయని అన్నారు.
ఏపీ ఫైబర్‌నెట్ చైర్మన్ హోదాలో ఏపీ ఫైబర్‌నెట్ నుంచి ఉద్యోగులను తొలగించాల్సిందిగా తమ సంస్థ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. ఈ విధంగా నియమించబడిన ఉద్యోగులను తొలగించేందుకు ముందు అన్ని చట్టపరమైన మార్గాలను అనుసరించామన్నారు.
అంతే కాకుండా న్యాయపరమైన ప్రక్రియల ప్రకారం చర్యలు తీసుకున్న తరువాతనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పారు జీవీ రెడ్డి.