టీడీపీలోకి మాజీ డిప్యూటీ సీఎం
జగన్ మోహన్ రెడ్డికి బిగ్ షాక్
అమరావతి – వైసీపీకి కోలుకోలేని షాక్ తగిలింది. జగన్ రెడ్డిని విడిచి వెళుతున్నారు కీలక నేతలు. తాజాగా మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సంచలన ప్రకటన చేశారు. తాను ఇవాళ టీడీపీ బాస్, సీఎం నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్బంగా బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటితో వ్యక్తిగతంగా మాట్లాడారు. దీంతో ఆళ్ల నానికి లైన్ క్లియర్ అయ్యింది.
మొత్తంగా ఎలాగైనా సరే వైసీపీని నామ రూపాలు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు ఓ వైపు చంద్రబాబు నాయుడు మరో వైపు పవన్ కళ్యాణ్. తాము అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలను తీవ్రంగా వేధింపులకు గురి చేశారని ఆరోపించారు.
పనిగట్టుకుని టీడీపీ వారికి చుక్కలు చూపించారు జగన్ మోహన్ రెడ్డి. దీంతో ఎలాగైనా తనను ఒంటరి చేసి పార్టీని ఖాళీ చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు టీడీపీలోకి కీలకమైన నేతలను చేర్చుకునే ప్లాన్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆళ్ల నాని చేరినా ..ఆ తర్వాత కీలకమైన నేతలంతా క్యూ కడతారని సమాచారం.