మంత్రి టీజీ భరత్ షాకింగ్ కామెంట్స్
అమెరికా – మంత్రి టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోని జ్యూరిచ్ లో జరిగిన తెలుగు పారిశ్రామికవేత్తల సమావేశంలో ఘాటు కామెంట్స్ చేయడం కలకలం రేపుతున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలోనే నారా లోకేష్ గురించి ప్రస్తావించారు. భవిష్యత్తులో తనే ఏపీకీ కాబోయే ముఖ్యమంత్రి అంటూ స్పష్టం చేశారు. ఎవరికి నచ్చినా నచ్చక పోయినా ఇది వాస్తవమని అన్నారు టీజీ భరత్.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఆయా జిల్లాల పార్టీల అధ్యక్షులతో పాటు మంత్రులు సైతం కోరుతుండడం, కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై ఇప్పటి వరకు స్పందించ లేదు సీఎం నారా చంద్రబాబు నాయుడు.
మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మంత్రులు రామ్మోహన్ రెడ్డి, నిమ్మల రామా నాయుడు, తదితరులు సైతం గొంతు విప్పారు. మరో వైపు రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టీజీ భరత్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.