పూజలు చేసిన సీఎం చంద్రబాబు
అమరావతి – అమరావతిలోని వెంకట పాలెం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. గవర్నర్, సీఎంలకు ఘనంగా స్వాగతం పలికారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామల రావు, ఏఈవో వెంకయ్య చౌదరి. స్వామి, అమ్మ వార్లను దర్శించుకున్న అనంతరం పూజలు చేశారు. అర్చన, హారతి, తీర్థాలు అందజేశారు. పూజారులు ఆశీర్వచనం చేశారు. జీయర్ స్వాములు గవర్నర్, సీఎంలకు ఆశీస్సులు అందించారు.
అంతకు ముందు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు స్వామి వారి ధ్వజ స్తంభం, గరుడ ఆళ్వార్ వద్ద నమస్కరించారు. శ్రీవారి సన్నిధికి చేరారు. ఈ సందర్భంగా మహా మండపంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి వర్యులకు టిటిడి ఛైర్మన్, టిటిడి ఈవో , టిటిడి అదనపు ఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాలను అందించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ చిన్న జీయర్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, పనబాక లక్ష్మీ, నన్నూరి నర్సిరెడ్డి, నన్నపనేని సదాశివరావు, ఎం.శాంతారాం, తమ్మిశెట్టి జానకి దేవి, సుచిత్ర ఎల్లా, ఎస్ నరేష్ కుమార్, జీ.భానుప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.