ఏపీ సర్కార్ ఖుష్ కబర్
ఇచ్చిన హామీల అమలు
అమరావతి – ఏపీలో కొత్తగా కొలువు తీరిన కూటమి సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇందులో భాగంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్కటొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పటికే 5 కీలక ఫైళ్లపై సంతకం చేశారు నారా చంద్రబాబు నాయుడు. మరో వైపు ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లు పెంచుతున్నట్లు వెల్లడించారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేతన్నలు, మత్స్య కారులు, కల్లు గీత కార్మికులు, డప్పు కళాకారులు, ఎయిడ్స్ బాధితులు, హిజ్రాలకు గత వైసీపీ ప్రభుత్వం నెల నెలా రూ. 3,000 వేలు ఇచ్చేది. ఈ మేరకు మరో 1,000 రూపాయలు పెంచుతూ రూ. 4,000 ఇస్తున్నట్లు స్పష్టం చేశారు ఏపీ సీఎం.
ఇక దివ్యాంగులకు తీపి కబురు చెప్పారు. గతంలో రూ. 3 వేలు వచ్చేవి వాటిని మరో మూడు వేలు పెంచుతూ నెల నెలా రూ. 6,000 ఇస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా కుష్టు వ్యాధితో ఉన్న వారికి కూడా గుడ్ న్యూస్ చెప్పారు. వారికి కూడా 6 వేలు ఇస్తామన్నారు.
కిడ్నీ, కాలేయం, గుండె మార్పిడి చేసుకున్న వారికి, డయాలసిస్ స్టేజీకి ముందున్న కిడ్నీ వ్యాధి గ్రస్థులకు గతంలో రూ. 5 వేలు వచ్చేవి ఇప్పుడు రూ. 10 వేలు ఇస్తామన్నారు. మంచానికి పరిమితమైన వారికి రూ 15 వేలు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం.