ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా మధుమూర్తి
ప్రకటించిన ఏపీ విద్యా శాఖ కార్యదర్శి శశిధర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విద్యా పరంగా కీలకమైన సంస్థ ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా మధు మూర్తిని నియమించింది. మూడు సంవత్సరాల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఆయన నియామకానికి సంబంధించి విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదిలా ఉండగా చైర్మన్ గా నియమితులైన మధు మూర్తి స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి మండలం జాగర్లమూడి స్వస్థలం. ప్రస్తుతం వరంగల్ లో నిట్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతకు ముందు ఏపీ ఉన్నత విద్యా మండలి చైర్మన్ గా హేమచంద్రా రెడ్డి ఉన్నారు. కానీ ఊహించని రీతిలో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ ఓడి పోయింది.
టీడీపీ , బీజేపీ, జనసేన కూటమి నేతృత్వంలోని ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో జగన్ రెడ్డి నియమించిన కీలకమైన పదవులలో ఉన్న వారంతా స్వచ్చంధంగా తమ పదవులకు రాజీనామా చేశారు. ఉన్నట్టుండి వాటి నుంచి తప్పుకున్నారు.
ఆనాటి నుంచి నేటి దాకా చైర్మన్ పోస్టు ఖాళీగా ఉంది. దీంతో విద్యా వ్యవస్థను గాడిలో పెట్టే సదరు మండలికి పూర్తి స్థాయిలో చైర్మన్ లేక పోతే కష్టమని సర్కార్ భావించింది. ఈ మేరకు మధు మూర్తికి బాధ్యతలు అప్పగించింది.