సీనియర్ ఐపీఎస్ సునీల్ కుమార్ కు షాక్
అమరావతి – ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఐడీ మాజీ చీఫ్ , సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ పై తీవ్ర అభియోగాలు మోపింది. ఈ మేరకు విచారణ చేపట్టాలని ఆదేశించింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీశ్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా గత వైసీపీ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగారు పీవీ సునీల్ కుమార్. ఆయన దళిత సామాజిక వర్గానికి చెందిన వారు. కావాలని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు పనిగట్టుకుని సునీల్ కుమార్ ను లక్ష్యంగా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని, పక్షపాత ధోరణితో వ్యవహరించ లేదంటూ ఇప్పటికే స్పష్టం చేశారు సీఐడీ మాజీ చీఫ్. వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేశానే తప్పా ఏ తప్పు చేయలేదని పేర్కొన్నారు.