ప్రధాన సంస్థలతో ఏపీ ఒప్పందం
వెల్లడించిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరింత దూకుడు పెంచారు. పెద్ద ఎత్తున ఐటీ, లాజిస్టిక్ కంపెనీలను ఇక్కడికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ విశాఖలో సెంటర్ ను ఏర్పాటు చేయనుందని ప్రకటించారు.
తాజాగా అధునాతన సాంకేతిక ఆవిష్కరణల కేంద్రంగా ఆవిర్భవిస్తున్న ఏపీలో డీప్ టెక్ ను అభివృద్ది చేయడంలో భాగంగా రెండు ప్రధాన సంస్థలతో ఒప్పందం చేసుకుంది ఏపీ సర్కార్. అమెజాన్ వెబ్ తో కలిసి ఫిజిక్స్ వాలా ఐఓఈయూఓఐని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.
మరో సంస్థ టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ కూడా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ రెండు సంస్థలు మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో ఒప్పందాలు చేసుకోవడం విశేషం. ఫిజిక్స్ వాలా ఎడ్యుటెక్ కంపెనీగా గుర్తింపు పొందింది.
మరో వైపు ఎపిలో ఉన్నత విద్యను ఆధునీకరించేందుకు టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ (TBI)తో మరో ఒప్పందం కుదిరింది. ఉండవల్లి నివాసంలో లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వంతో ఫిజిక్స్ వాలా, టోనీబ్లెయిర్ ఇనిస్టిట్యూట్ ప్రతినిధులు వేర్వేరుగా ఎంఓయుపై సంతకాలు చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ఇన్నోవేషన్ విశ్వవిద్యాలయం అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్స్ ను ఏకీకృతం చేసే దిశగా పని చేస్తుందన్నారు. పరిశోధన, విద్య, ఉపాధిలో కీలక సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి సారిస్తుందని చెప్పారు లోకేష్.