కూటమి సర్కార్ సంచలన నిర్ణయం
అమరావతి – ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేసింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. 2020 – 2024 మధ్య సునీల్ కుమార్ ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా, అఖిల భారత సర్వీస్ నిబంధనలను ఉల్లంఘించి అనేకసార్లు విదేశాలకు వెళ్లారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సస్పెన్షన్ వచ్చింది.
మాజీ ఎంపీ , ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు వేధింపుల కేసుకు సంబంధించి కూడా సీనియర్ అధికారి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం గతంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ దర్యాప్తు ఫలితాల ఆధారంగా, AP రాష్ట్ర ప్రభుత్వం సునీల్ కుమార్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది, దీని ఫలితంగా నేటి సస్పెన్షన్ ఉత్తర్వు వచ్చింది. దీనిపై స్పందించారు పీవీ సునీల్ కుమార్. ఇది కావాలని కక్ష సాధింపు ధోరణితో తీసుకున్న చర్యగా అభివర్ణించారు.