తెలంగాణ ఆస్పత్రుల్లో కూడా అమలు
అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య భీమా పథకం అమలుకు సంబంధించి తీపి కబురు చెప్పింది. ఏపీలోనే కాకుండా తెలంగాణలోని ఆస్పత్రులలో కూడా స్కీం వర్తించేలా మార్పు చేసింది. డీఎంఈ గుర్తించిన ఆస్పత్రుల్లో చికిత్స తీసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణలోని రిఫరల్ ఆస్పత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోను ఆదేశించింది.
సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఉద్యోగులు చికిత్స కు సంబంధించి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ప్రస్తావనకు వచ్చింది. దీనిపై సీఎం కీలక సూచన చేశారు.
ఎక్కడ నాణ్యవంతమైన వైద్య సౌకర్యాలు కలిగి ఉన్నట్లయితే అక్కడ వైద్యం చేయించుకునేలా మార్పు తీసుకు వస్తే బావుంటుందని సూచించారు. దీనిపై మంత్రి సత్య కుమార్ యాదవ్ సైతం ఓకే చెప్పారు. ఈ మేరకు విధానాలను ఖరారు చేయాలని స్పష్టం చేశారు.