ఏపీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
అమరావతి – ఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. ఈ సందర్బంగా వైసీసీ సభ్యులు జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందని, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఈ సందర్బంగా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
సభ్యులు పెద్ద ఎత్తున సేవ్ డెమోక్రసీ అంటూ నినాదాలు చేశారు. అయినా వారి నిరసనను పట్టించు కోకుండానే గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా తమ ప్రభుత్వం అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు.
అశాస్త్రీయంగా జరిగిన విభజనతో ఏపీకి నష్టం జరిగిందని చెప్పారు..విభజనతో రెవెన్యూ లోటు కారణంగా రాష్ట్రం ఒడిదుడుకులు ఎదుర్కొందని పేర్కొన్నారు. అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.. 2014-19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయంటూ చెప్పారు గవర్నర్.
.2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించ గలిగిందన్నారు.. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశామని తెలిపారు… అభివృద్ధి దిశగా పరుగు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందన్నారు.