తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
అభినందనలు తెలిపిన గవర్నర్
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అద్భుత సందేశాన్ని ఇచ్చారు. శనివారం ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తరపున గవర్నర్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోనుంది. ఇప్పటికే రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లలో నిమగ్నమైంది.
2014 జూన్ 2న భారతదేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది. ఈ సందర్బంగా పదేళ్లు పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రజలకు అభినందనలు తెలిపారు గవర్నర్ అబ్దుల్ నజీర్. తెలంగాణ రాష్ట్రం ఒక పుణ్యభూమి, వివిధ సంస్కృతుల ఏకైక సంశ్లేషణతో శక్తి వంతమైన కళలు , చేతి పనులతో అభివృద్ధి చెందుతోంది,
సమ్మిళిత సంస్కృతి , సంప్రదాయాలను కలిగి ఉన్నది తెలంగాణ ప్రాంతమని పేర్కొన్నారు గవర్నర్. బతుకమ్మ, తెలంగాణా రంగుల పూల పండుగ, మహిళలు జరుపుకుంటారు, ఇది తెలంగాణ సాంస్కృతిక గుర్తింపుకు గర్వకారణమని తెలిపారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాష్ట్ర అవతరణ దినోత్సవం వంటి సందర్భాలు దేశంలోని ప్రజల మధ్య బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాయని స్పష్టం చేశారు గవర్నర్.